National
LPG: వంటగ్యాస్ సబ్సిడీకి కొత్త రూల్.. అక్టోబర్ 1 నుంచి అమలు!
దేశీయ వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ(సబ్సిడీ) ధరకే వంటగ్యాస్ సిలిండర్లను పొందాలంటే 2026 అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (BAA) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, గృహ అవసరాల సిలిండర్లు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అక్రమంగా మళ్లకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
