ఏపీ

లవ్ మ్యాటర్?.. విశాఖలో నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్ వార్

ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో నడిరోడ్డుపై కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగినట్టు తెలిసింది. రెండు వర్గాలుగా విడిపోయిన స్టూడెంట్స్ దారుణంగా దాడులు చేసుకున్నారు.అయితే, యువకుల మధ్య కొట్లాటకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. చంద్రంపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గ్యాంగ్ వార్‌గా మారినట్టు తెలుస్తోంది. ఘర్షణ జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఆపిన విద్యార్థులు అతనిపై కూడా దాడి చేశారు.