ఏపీ
సరిహద్దులు దాటిన ప్రేమ.. స్పెయిన్ అబ్బాయిని పెళ్లాడిన తెలుగు యువతి
ప్రేమకు సరిహద్దులు లేవని, హృదయాల కలయికకు సంస్కృతుల భేదం అడ్డంకి కాదని తణుకులో జరిగిన ఓ వినూత్న పెళ్లి వేడుక నిరూపించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన బొప్పనపల్లి ప్రియదర్శిని, స్పెయిన్ దేశానికి చెందిన అమిన్ అల్ రహాద్ దంపతులు తెలుగు సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
