రాజకీయాలు

ఊడిన కుట్లు, వెలిసే రంగులు.. ఇదేనా రేవంత్ చెప్పే ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ? : హరీశ్ రావు

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు, చెబుతున్న మాటలపై మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.మాట్లాడితే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తున్నానని చెప్పే రేవంత్ రెడ్డి.. విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ ఇవేనా? అని ప్రశ్నించారు.చాలా చోట్ల ఒక జత యూనిఫామ్స్ కూడా అందలేదని, అందిన చోట క్వాలిటీ బాలేదని, నాసిరకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా రాష్ట్రంలోని విద్యార్థులకు అందించిన యూనిఫామ్స్‌కు సంబంధించి క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.