ఎంతకు తెగించార్రా.. ఆ బంగారం అమ్మి భార్యకు ఐ ఫోన్ బహుమతి!
ఐఫోన్ అంటే కొందరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బ్రాండ్ కావడంతో దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా భారతీయులకు ఐఫోన్‌తో విడదీయని బంధం ఏర్పడింది. ఒకప్పుడు ఐఫోన్ అంటే కేవలం డబ్బులు ఉన్నవారి దగ్గరే ఉండేదనే భావన ఉంది. కానీ, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం యాపిల్ ఫోన్స్ వాడుతున్నారు. టెక్నాలజీ ఎక్కువగా వినియోగించే వారు తప్పకుండా ఐఫోన్ క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే ఐఫోన్లో తీసే ఫొటోలు అంత క్లారిటీగా ఉంటాయి. హెచ్డీ కెమెరాలకు తీసిపోని విధంగా పిక్చర్స్ క్యాప్చర్ చేయడం దాని సొంతం. కాగా, నిన్న ఐఫోన్ కొనేందుకు వచ్చిన కొందరిని ఇన్ ఫ్లూయెన్సర్స్ ఇంటర్వ్యూ చేయగా..షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఓ వ్యక్తి తన వద్ద ఐఫోన్ 18 సిరీస్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తన తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మి లేటెస్ట్ సిరీస్ ఐఫోన్ కొని తన భార్యకు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరొకరు తన భార్యకు గిఫ్టు ఇచ్చేందుకు పంజాబ్ నుంచి నోయిడాకు జర్నీ చేసినట్టు వెల్లడించారు.
