ఏపీ ‘లోకల్’ హీట్..టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అధికార కూటమి పార్టీని దెబ్బకొట్టాలని ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అదే దూకుడుతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే బిజీలో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పుంగనూరులో నామినేషన్ వేసే అభ్యర్థులతో కలిసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎలక్షన్ కేంద్రానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దీంతో మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొంతమందికి గాయాలయ్యాయి.
