National

సహజీవనం.. అలా చేస్తే ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదు : సుప్రీంకోర్టు

ఇద్దరు వ్యక్తులు కొంతకాలం సహజీవనం చేశాక అనివార్య కారణాలతో ఒకరికొకరు దూరం కావడం, పెళ్లికి నిరాకరించారనే కారణంతో పురుషుడు లేదా మహిళ ఆత్మహత్యకు పాల్పడితే దానిని.. అది బలవన్మరణానికి ప్రేరెపించినట్టు కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం పెళ్లికి నిరాకరిస్తే అవతలి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెల్లడించింది.తెలంగాణకు చెందిన ఓ కేసులో మృతురాలి భాగస్వామి, అతని తల్లిదండ్రులు, సోదరి సహా ఆరుగురు నిందితులపై నమోదైన క్రిమినల్ కేసును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది.