National
Listening Tour: సీజేపీ మాస్టర్ ప్లాన్.. నీట్ ఉద్యమం తర్వాత సరికొత్త రాజకీయ వ్యూహం!
నీట్ పేపర్ లీక్.. అందుకు వ్యతిరేకంగా చేపట్టిన సుదీర్ఘ ఆందోళనల విజయంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఊపుమీదుంది. ఇదే ఉత్సాహంతో సరికొత్త రాజకీయ వ్యూహాలకు సద్ధమవుతోంది. తమ పోరాటానికి లభించిన ఆదరణను కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా యువతతో నేరుగా మమేకమయ్యేందుకు 'లిజనింగ్ టూర్' పేరిట ప్రత్యేక పర్యటన చేపడుతున్నట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. భారతదేశంలోని యువత ఆశయాలు, వారి సమస్యలు, ప్రధాన ఆందోళనలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ దేశవ్యాప్త పర్యటన ముఖ్య ఉద్దేశమని పార్టీ ప్రకటించింది. తమ భవిష్యత్ రాజకీయ, సంస్థాగత కార్యాచరణను ఖరారు చేసేందుకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీజేపీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.
