ఏపీ

ఏపీలో పిడుగుల బీభత్సం.. నలుగురు మృతి

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది.రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావం కారణంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని కన్నీటిపర్యంతమైన అన్నదాత నేడు వర్షాలు కురుస్తుండటంతో పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, పల్నాడు జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడగా పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి భారీ వర్షంతో పాటు పెద్దఎత్తున పిడుగులు పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిడుగుపాటుకు గురై ఒకేరోజు నలుగురు మృతి చెందినట్టు సమాచారం.