తెలంగాణ
ఎస్‌బీఐ స్టాఫ్ చేతివాటం? బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయం?
ఆలేరులోని ఓ ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్ ఆఫీసులోని లాకర్‌లో బంగారు నగలు మాయం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 తులాలు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో బంగారం పొగొట్టుకున్న వారు వృద్ధదంపతులు. నగలు డిపాజిట్ చేశాక చాలా కాలం తర్వాత రెండు సార్లు మాత్రమే బ్యాంకు వెళ్లి నగలు చూసుకున్నామని చెబుతున్నారు. కానీ, బ్రాంచ్ ఆఫీసులో నగలు మాయం కావడం.. రికార్డులు సరిగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆలేరు మండలం గుండ్లగూడెంకు చెందిన అంగిరేకుల కృష్ణమూర్తి, లక్ష్మీబాయి దంపతులు 2013లో లాకర్ (నం.ఎ1/12/ ఎస్‌బీఐ-ఆలేరు) సౌకర్యం పొందారు. 22.5.2013వ తేదీన 18 తులాల బంగారు నగలు లాకర్‌లో భద్రపరించారు. అనంతరం 24.12.2018న లాకర్‌ను తెరిచినట్లు బ్యాంకు రికార్డుల్లో నమోదు అయి ఉంది.
