ఏపీ
22-A భూములపై నిషేధం తొలగించండి.. : సీఎం చంద్రబాబుకు లేఖ!
ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22-A పరిధిలో ఉన్న అర్హత కలిగిన భూములపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. చట్టబద్ధత, అర్హత కలిగిన ప్రైవేట్, ఫ్రీహోల్డ్ భూములను తక్షణమే 22-A జాబితా నుంచి మినహాయించాలని ఆయన కోరారు. ఆయా భూ యజమానులకు గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించి వారి హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా లేఖలో విజ్ఞప్తి చేశారు.
