అభిప్రాయం

గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు?

గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు? సోషల్ మీడియా ప్రభావమా? కుటుంబంలో తగ్గుతున్న సంభాషణా? చదువు, ఉద్యోగాల ఒత్తిడా? లేక మారుతున్న జీవనశైలినా? యువతను తప్పుపట్టడం సులభమే.. కానీ వారి సమస్యలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరైన మార్గనిర్దేశం, కుటుంబం నుంచి ప్రోత్సాహం, సమాజం నుంచి సహకారం అందితే.. యువత దేశ భవిష్యత్తును మార్చగల శక్తిగా నిలుస్తుంది.