అభిప్రాయం

నిజమైన స్నేహితులను ఈ సంకేతాలతో గుర్తించండి!..

స్నేహం అంటే బాల్యం, కౌమారం, యవ్వనంలో కలిసే బంధాలు కాదు.. కొందరి జీవితాల్లో ఈ దశలో కలిగిన పరిచయాలు కూడా బలంగా మారవచ్చు.. అయితే ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన తర్వాత స్నేహం అర్థం పూర్తిగా మారిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.. చిన్నప్పుడు ఎక్కువ మంది స్నేహితులు ఉండటం ఆనందంగా అనిపిస్తుంది. కానీ వయసు పెరిగేకొద్దీ పరిచయాలు పెరగడం కంటే.. మనసును అర్థం చేసుకునే మనుషులు ఉండటం ముఖ్యం అవుతుంది. మరోవైపు 40 వయస్సుకు జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం, ఉద్యోగం, పిల్లలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం.. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య కూడా మనసులో మన స్థానాన్ని మార్చుకోని కొందరు ఉంటారు. వాళ్లే నిజమైన స్నేహితులుగా పేర్కొంటారు.