తెలంగాణ
కొరడా ఝళిపించిన టీజీ సేఫ్.. 11 ప్రధాన హోటల్స్ లైసెన్స్ రద్దు
TG Safe: హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ పై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. 11 ప్రధాన హోటళ్ల లైసెన్స్ లు రద్దు చేసింది. మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్స్ లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వంట గదులు దుర్గంధపూరితంగా ఉన్నాయి. దీంతో టీజీ సేఫ్ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్ల లైసెన్సులు రద్దు చేశారు.
హైటెక్ సిటీ
* మొనాస్ట్రీ
* కోల్ స్పార్క్ రెస్టారెంట్
* కాంచి కేఫ్
గచ్చిబౌలి
* శివాణి బార్ అండ్ రెస్టారెంట్
* అల్‌సబా రెస్టారెంట్
* ఉడిపీస్ ఉపహార్
* అంటెరా కిచెన్ అండ్ బార్
మాదాపూర్
* లక్కీ రెస్టారెంట్
* సాయిరామ్ మెస్
* ఇనార్బిట్ మాల్‌లోని అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్
* మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని ఫ్యూజన్9, అమ్నీషియా స్కై బార్ లైసెన్స్ రద్దు
