విద్యార్థినులతో లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన స్టూడెంట్స్
మంచి చెడులు బోధించాల్సిన ఉపాధ్యాయులే విలువలు మర్చిపోతున్నారు.తల్లిదండ్రుల తర్వాత గురువులకే అంతటి ప్రాధాన్యం ఇవ్వాలని స్కూల్లో పాఠాలు బోధించే కొందరు గురువుల బుద్ధి గతి తప్పుతోంది. ఫలితంగా ఉపాధ్యాయ వృత్తికి వారు కళంకం తీసుకొస్తున్నారు. ఓ లెక్చరర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థినులు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు.నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీలో ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. తెలుగు ఉపాధ్యాయుడు భాస్కర్ గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకులు ఇవాళ ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఉపాధ్యాయుడు భాస్కర్‌పై విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు. కళాశాల వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
