స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
చూసి నేర్చుకో రేవంత్.. లేదంటే చెత్త సీఎం అవుతావు!
ఆంధ్రాలో తుఫాన్ భీభత్సం సృష్టించింది. చెరువులు, వాగులు జలకళసంతరించుకున్నాయి. కానీ, తెలంగాణలో జనం నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. కరువు అనేది దశాబ్దాల నుంచి ముందే హెచ్చరించేది. పెను తుఫాన్లు వారం ముందే తెలుస్తాయి. ప్రభుత్వాలు పసి గట్టి అలర్ట్ అవ్వాలి. కానీ, మీ నిద్రమత్తు కమీషన్స్ పాలనలో కరువుకు కారణం ఆనాటి పాలన అంటూ వదిలించుకోవాలనుకుంటున్నారు. మీ వద్ద 130 మంది ఐఏఎస్లు, 120 మంది ఐపీఎస్లు వాళ్ల కింద లక్షల మంది ఉద్యోగులు ఉన్నా మీరు కరువుపై ఏనాడూ ఆదేశించలేదు. మీ పైరవీకారుల గురించే చెప్పారు. అందుకే ఈనాడు ఇంతగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది.
