శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ పోర్టులోని డిపాచర్ సెక్షన్లో నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుంది.అనుమానంతో వారి బ్యాగులను స్కానింగ్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో రహస్య గదుల వలే ర్యాక్స్ ఏర్పాటు చేసి దాచిన విదేశీ కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి.
