స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

LandScam: బంజారాహిల్స్‌లో 'మెగా' స్కెచ్.. రూ.2,200 కోట్ల స్థలం ఆక్రమణ!

భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిపై కార్పొరేట్ పంజా పడింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్( సాక్షిగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని సుమారు రూ.2,200కోట్ల విలువైన 11 ఎకరాల విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు అధికార పక్ష పెద్దల అండదండలతో ఒక భారీ స్కెచ్ వేశారు. కేబీఆర్ పార్కు ప్రాంగణంలో ఇటీవల చెట్లు నరికిన ఘటన మరవకముందే, దానికి సమీపంలోని ఈ పచ్చని అడవిపై యంత్రాలతో దాడి చేసి వేలాది వృక్షాలను నేలమట్టం చేస్తుండటం స్థానికులను, పర్యావరణ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.