క్రైమ్

Land Grab: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో సొంత బాబాయి భూమి కబ్జా..! శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరాచకాలు..!

Srihari Goud: శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత బాబాయికే ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని భూమిని కబ్జా చేసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాబాయ్ భార్య, ఆమె కొడుకు శ్రీహరి గౌడ్ ను నిలదీయగా.. వారిపై విచక్షణారహితంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది.