తెలంగాణ

LandFraud: ఎమ్మెల్సీకే భూమి పేరుతో భారీ మోసం.. రూ.25లక్షల టోకరా!

 హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన మాదాపూర్ 100ఫీట్ల రోడ్డులో తమది కాని భూమిని తమదేనని నమ్మించి, ఏపీ  కూటమి ప్రభుత్వ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను రూ.25లక్షల మేర బురిడీ కొట్టించిన ఉదంతం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ఎమ్మెల్సీ రామచంద్రయ్యను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు పక్కా వ్యూహంతో ఈ రియల్ ఎస్టేట్ మోసానికి తెగబడ్డారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. పేరూరి తులసీగోపాల్, అతని కుమారుడు గిరిధర్‌లు మాదాపూర్ 100 ఫీట్ల రోడ్డులోని ప్రైమ్ లొకేషన్‌లో తమకు 5.5ఎకరాల భూమి ఉందని ప్రచారం చేసుకున్నారు.