తెలంగాణ
కాంట్రాక్ట్ ఉద్యోగాలతోనే కోట్ల సంపాదన.. లక్ష్మీ భాస్కర్ కి కలిసొచ్చిన లక్కదే!
ఒక ప్రభుత్వ వైద్యుడు.. నిమ్స్‌లో కీలక పరిపాలనా బాధ్యతలు.. మరి ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయి? నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్ ఎపిసోడ్ లో వినిపిస్తున్న ప్రశ్నలివి. వైద్యం చేయాల్సిన డాక్టర్.. ప్రభుత్వ జీతంతో పనిచేసే వైద్యాధికారి.. కానీ ఇప్పుడు ఆయన ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
