క్రైమ్

సిద్ధిపేటలో లేడీ కిల్లర్స్.. డబ్బుల కోసం దారుణ హత్యలు?

సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు మహిళలు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా సిద్ధిపేటలో ఇద్దరు మహిళలు ఈజీ మనీ కోసం ఏకంగా దారుణాలకు పాల్పడ్డారు. ఓ మహిళల తన భర్త బీమా డబ్బుల కోసం అతన్ని హతమారిస్తే... మరో మహిళ ఏకంగా తన మైనర్ కొడుకు సాయంతో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి హతమార్చడం చేసింది. ఈ ఘటనలు ఒక్కసారిగా సిద్ధిపేట ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.ఈ రెండు ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి.