National
Ladakh Earthquake: లడఖ్‌లో భూకంపం.. 5.5 తీవ్రతతో ప్రకంపనలు!
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 6:05 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5తీవ్రతతో నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) అధికారికంగా ధ్రువీకరించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు, ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం భూమి అంతర్భాగంలో కేవలం 10 కిలోమీటర్ల తక్కువ లోతులోనే కేంద్రీకృతమై చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
