ఏపీ
Kurnool: పోతిరెడ్డిపాడు వద్ద భారీ ప్రమాదం.. తెగిపోయిన 9వ గేటు రోప్!..
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో, హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి గేట్లను పైకి ఎత్తుతున్న క్రమంలో అకస్మాత్తుగా 9వ గేటుకు సంబంధించిన రోప్ తెగిపోయింది. ఈ ఘటనతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గేటు కిందపడిపోవడంతో నీటి విడుదల నియంత్రణకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
