క్రీడలు

Kuldeep Yadav: ఒక్క మ్యాచ్‌కే పక్కనపెడతారా?.. కుల్దీప్ స్థానంలో కొత్త స్పిన్నర్ అరంగేట్రం!

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల ఘన విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసిన భారత జట్టు, ఇప్పుడు కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుపై పూర్తి దృష్టి సారించింది. తొలి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ జట్టు కూర్పులో కీలక మార్పు చేయాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టులో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.