తెలంగాణ

ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి భూమి..

KPHB: హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్ రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన 2.39 ఎకరాల స్థలాన్ని ఎట్టకేలకు హౌసింగ్ బోర్డు నుంచి విద్యాశాఖకు బదిలీ చేయడం పట్ల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ మనూ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారాయన.

మూడేళ్ల క్రితమే పునాదులు

సుమారు మూడేళ్ల క్రితం రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టి పాఠశాల పునాదులు కూడా వేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారడంతో హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకాలకు పెట్టడంతో పాఠశాల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డ్ స్థలాలు అమ్మొద్దంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజా మద్దతుతో పోరాటం చేశారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 2.39 ఎకరాల స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేయడంలో జాప్యం జరగడంతో పాఠశాల నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.