తెలంగాణ
కేటీఆర్ స్టాఫ్‌పై దాడి అంటూ ప్రచారం.. అసలు నిజం చెప్పిన పోలీసులు!
తెలంగాణ రాజకీయాల్లో మరో తీవ్ర దుమారం చెలరేగింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై దాడి జరిగిందన్న అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లోని విచారణ గదిలోనే ముసుగులు ధరించిన వ్యక్తులు ఈ దాడికి ఒడిగట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేయగా, పోలీస్ యంత్రాంగం ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.
