తెలంగాణ
KTR vs Komatireddy: నల్గొండలో హీటెక్కిన పాలిటిక్స్! కేటీఆర్ పాదయాత్ర వర్సెస్ కోమటిరెడ్డి సవాల్
KTR vs Komatireddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగునీటి వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటడంతో స్టార్ట్ అయిన ఈ వాటర్ వార్.. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోవడంపై గులాబీ, హస్తం నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు నిరసన సభ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
