తెలంగాణ
మిర్యాలగూడకు కేటీఆర్.. రైతు సమస్యలపై పోరాటం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మిర్యాలగూడకు వెళ్లనున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్ఎస్పీ క్యాంప్ మైదానంలో కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పాలనలో వైఫల్యం, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు యూరియా కొరత, రైతు భరోసా, సాగునీరు, విద్యుత్ సమస్యలపై మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, హామీల అమలుపైనూ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు తెలుస్తోంది.
