తెలంగాణ

నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ

కాంగ్రెస్ పార్టీ తీరు,వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్‌కు వెళ్లనున్నారు.రానున్న రోజుల్లో ప్రభుత్వ తలరాతను డిసైడ్ చేసేది యువతరం అని గుర్తించిన కేటీఆర్.. వారితో ఇటీవల తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు.వచ్చే ఎన్నికల్లో యువతరమే టార్గెట్‌గా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు సైతం ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను సర్కార్ మోసం చేసిందని విమర్శిస్తున్న కేటీఆర్.. నేడు కరీంనగర్‌లో ‘జెన్ జీ’తో భారీ సభను నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంబేద్కర్‌ మినీ స్టేడియంలో జెన్‌ జీ సభ కోసం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నాం సభ ప్రారంభంకానుందని సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థులు, యువతతో కేటీఆర్‌ సమావేశం అవుతారని, ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగనుందని తెలుస్తోంది.