తెలంగాణ

TG: ‘రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది’.. : కేటీఆర్

TG: తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ, ఆయన నడుపుతున్న పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయాలపై సంచలన విషయాలు మాట్లాడారు.రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి కేవలం కొద్దిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపుణులు ముందే చెప్పినా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు.