తెలంగాణ

TG: రైతుల బతుకులతో రేవంత్ ఆటలు.. 24 గంటల కరెంట్ ఏదని ప్రశ్నించిన కేటీఆర్!

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని గాలికొదిలేసి రైతులను నట్టేట ముంచారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన 'రైతు గర్జన' సభకు వెళ్తున్న క్రమంలో ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌లతో పాటు పలువురు రైతులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.నీరు, కరెంట్ సక్రమంగా అందక నిలువునా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో సాగునీరు అందించక, విద్యుత్ సరఫరా చేయక చేతులెత్తేశారు.