తెలంగాణ
రైతు సదస్సుల నుంచి పాదయాత్ర దాకా.. కేటీఆర్ ప్లాన్ ఇదేనా?
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్రల చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు, ధర్నాలు, నిరసనలకే పరిమితమైన పార్టీ ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
