తెలంగాణ
మళ్ళీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం-కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం!..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసిన కేటీఆర్.. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
