తెలంగాణ

KTR: నచ్చినోళ్లకే దోచిపెట్టారు.. రేడియల్ టెండర్లను రద్దు చేయాల్సిందే: కేటీఆర్

KTR: రేడియల్ రోడ్ల ప్రాజెక్టు కేటాయింపుల్లో పారదర్శకతను తుంగలో తొక్కి తమకు కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఏకంగా రూ.600 కోట్ల మేర లాస్ వచ్చేలా సాగిన ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రూల్స్‌కి విరుద్ధంగా పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా ముక్కలు చేసి, తక్కువ కోట్ చేసిన బిడ్డర్లను పక్కనపెట్టి ఎక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకే దక్కేలా చక్రం తిప్పారని కేటీఆర్ ధ్వజమెత్తారు.