తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

KTR : తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై జోరుగా సాగుతున్న ప్రచారాలకు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో తెరదించారు. రాబోయే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’’ సదస్సులో పాల్గొన్న ఆయన, విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.2028 ఎన్నికల్లో బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ చేతులు కలపబోతోందా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఏమాత్రం తడబడకుండా స్పందించారు. "బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు" అని ఒక్క మాటలో స్పష్టం చేస్తూ ఊహాగానాలకు బ్రేక్ వేశారు. సొంత బలంతోనే ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరతామనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.