రాజకీయాలు
రేవంత్ ఫ్యామిలీ సంపాదించుకుంటుంటే కేటీఆర్ ఓర్వట్లేదు : ఎంపీ చామల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? ఆయన కుటుంబం సంపాదించుకుంటుంటే ఎందుకు ఓర్వట్లేదు. ఏదో తక్కువ పెట్టుబడితో అనుముల కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే రాద్దాంతం చేస్తున్నారు. అందరికి కేటాయించినట్లే అప్లికేషన్ పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి భూమి కేటాయించారు’ అని కాంగ్రెస్ ఎంపీ చామల ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.
