కేసీఆర్ ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రీవెంజ్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొన్నజరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికార పార్టీని రెచ్చగొట్టాలని, సమావేశాలు సజావుగా సాగకుండా చేయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు సమాచారం.కాగా, కేసీఆర్ మీద హత్యాయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే ‘కేసీఆర్ చనిపోవాలి.. ఆయన చావును కోరుకుంటున్నాం’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. విషయం తెలియడంతో కేటీఆర్,హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలుదేరినట్టు సమాచారం.
