తెలంగాణ

బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాళ్లపై దాడికి కారణం రేవంతే : కేటీఆర్

KTR: చట్టసభల్లో సమస్యలపై చర్చించడంతో పాటు అవసరమైతే నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు చీర పట్టి లాగడంతో ఆమె కంచెపై పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటనలో కోవ లక్ష్మి లేకపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని వ్యాఖ్యానించారు. చివరకు సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, సాధికారత గురించి కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుతుంటే.. రాష్ట్రంలో వారి పార్టీ ప్రభుత్వం కింద మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం అన్నారు.