తెలంగాణ
KTR:పాదయాత్ర చేస్తా- కేటీఆర్ కీలక ప్రకటన.. ప్రభుత్వానికి 10రోజుల డెడ్లైన్
KTR: రైతన్నల పంటలను కాపాడేందుకు మరోసారి పోరాటానికి సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారో స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా స్పందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు స్వయంగా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.
