సినిమా
సైలెంట్‌గా కానిచ్చేస్తున్న క్రిష్..
Krish: క్రిష్ దర్శకత్వంలో అంతా కొత్త వాళ్ళలో సినిమా రూపొందుతోంది. ‘జెంజ్ బ్యాచ్’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ల్యాబ్‌లో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా వదలకుండా చాలా సీక్రెట్‌గా ఈ మూవీని కంప్లీట్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఫస్ట్ కాపీ రానుంది. మరి, ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి క్రిష్ ఫాంలోకి వస్తాడా లేదా చూడాలి.
