తెలంగాణ

నల్ల బజార్ లో రేషన్ బియ్యం.. పర్యవేక్షణ లోపమా!? అధికారుల నిర్లక్ష్యమా!?..

పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్‌ రేషన్‌ బియ్యంపై అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. కాకినాడకు తరలిస్తే ఎక్కువ కిరాయి ఇస్తామని చెప్పడంతో.. మొగిల్ల శివ ప్రసాద్ తన వాహనంలో ఏకంగా 40 క్వింటాళ్ల బియ్యాన్ని లోడ్ చేసుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో టేకులపల్లి పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు లక్షా ఒక వెయ్యి 250 రూపాయల విలువైన బియ్యాన్ని, అశోక్‌ లేల్యాండ్‌ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్‌ కింద కూడా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్‌ఐ తిరుపతి హెచ్చరించారు.