తెలంగాణ
కొత్తగూడెం ఎయిర్పోర్ట్ లో కీలక పరిణామం!..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానాశ్రయానికి అనువైన ప్రాంతాల ఎంపిక కోసం కేంద్ర బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న అవకాశాలను కేంద్ర సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుందని పేర్కొన్నారు..
