క్రైమ్
Kothagudem: కదులుతున్న బస్సులోంచి కండక్టర్ను తోసేసిన మహిళ ప్రయాణికురాలు.. చివరికి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిల్లర వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మిట్టగూడెం వద్ద మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో బాలుడి టికెట్ విషయంలో ప్రయాణికురాలికి, మహిళా కండక్టర్ ప్రవల్లికకు వాగ్వాదం జరిగింది. చిల్లర విషయంలోనూ గొడవ కొనసాగడంతో ప్రయాణికురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు కండక్టర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికురాలు ప్రవల్లికను నెట్టివేయడంతో, ఆమె కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపింది.
