ఏపీ

Korukonda: కబ్జాలో దేవుడి భూములు.. పరాయి పంచన 100 ఎకరాలు!!..

గ్రామపెద్దల కారణంగా కోరుకొండ దేవస్థానానికి సంబంధించిన సుమారు 100.08 ఎకరాలు పరాయి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. నాలుగు మండలాల పరిధిలోని 11 గ్రామాల్లో సుమారు 40 మంది పేరుతో ఈ భూములు ఉన్నాయి. 2012, 2013లోనే ఇవి పరాయి పంచన ఉన్నట్లు దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. కానీ నేటికీ చర్యలు తీసుకోలేదు.