తెలంగాణ

సీఎం రేవంత్‌ వద్దే ‘కొండా’ మంత్రిత్వ శాఖలు

రాష్ట్ర రాజకీయాల్లో ‘కొండా సురేఖ’ఎపిసోడ్‌కు నిన్నటితో ఎండ్ కార్డు పడింది. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విధంగానే కాంగ్రెస్ హైకమాండ్ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలోనే కొండాను కేబినెట్ నుంచి తప్పిస్తూ లోక్‌భవన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ వచ్చాక పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ .. గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాను కలిసి కొండాను తప్పించడానికి గల కారణాలను వివరించడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం సంక్రమించిన అధికారాలతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ లోక్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.కొండా బర్తరఫ్‌ నేపథ్యంలో ఆమె మొన్నటివరకు నిర్వహించిన అటవీ, దేవాదాయ శాఖలను సీఎం రేవంత్‌‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.