తెలంగాణ
TG: కొండగట్టు అంజన్న భక్తులకు అలర్ట్.. ఈ 6 రోజులు మూలవిరాట్టు దర్శనం ఉండదు!
TG: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు దేవస్థానం అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న 'చందనోత్సవం - మహా సంప్రోక్షణ' వేడుకల నేపథ్యంలో, ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు స్వామివారి మూలవిరాట్టు దర్శనం భక్తులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తులు తమ యాత్రలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.చందనోత్సవం, మహా సంప్రోక్షణ వైదిక క్రతువుల దృష్ట్యా గర్భాలయంలోని మూలవిరాట్టు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా 'బాలాలయం' ఏర్పాటు చేసి, అక్కడ స్వామివారి దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు.
