తెలంగాణ

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్

కొండా సురేఖ ఎపిసోడ్ మీద తాజాగా కొండా సుస్మిత స్పందించారు. తన తల్లికి జరిగిన అవమానంపై సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో సీఎం రేవంత్ మీద మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ కొండా సుష్మిత భోరున ఏడ్చేశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్ల ఈ స్థాయికి వచ్చిన మా అమ్మానాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టాలా?మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే.. అలా మాట్లాడేదాన్ని కాదు.మా అమ్మ చేసిన ఒక్క తప్పు చూపించండి. పార్టీలో నేనైనా ఉండాలి.. ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి సీఎం దిగజారుతారా? నేను మాట్లాడిన మాటల్లో తప్పులేదు. రేవంత్‌ రెడ్డి ఇంత పగ పడతారని అనుకోలేదు. నా కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారు’ అంటూ సుష్మిత ఆవేదన వ్యక్తంచేశారు.