కొండా సురేఖ మంత్రి పదవి సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?
రాష్ట్రంలో కొండా సురేఖ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆమె మంత్రి పదవి ఉంటుందా? పోతుందా? అనే దానిమీదే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరేమో ఆమె పదవి పోవడం ఖామయని అంటుంటే.. మరికొందరు పోదని కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని చర్చ జరుగుతున్నది. కొండా సురేఖ తప్పు లేదని.. ఆమె కూతురు చేసిన దానికి తనను శిక్షిస్తే ఏం వస్తుందని కాంగ్రెస్ పార్టీలోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బీసీ లీడర్లు పరోక్షంగా కొండాకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీలకు తెలంగాణ మంత్రివర్గంలో సరైన వాటా దక్కలేదు. మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను. అలాంటప్పుడు సురేఖను మంత్రి పదవి ఎందుకు తొలగిస్తాము? మరల ఆమె స్థానంలో కొత్తవారికి ఎందుకు చాన్స్ ఇస్తాము?’ అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
