తెలంగాణ

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతని మీద హత్యాయత్నం మీద కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి అబ్‌స్కాండ్ అయినట్టు సమాచారం. మంత్రి కొండా మాజీ ఓఎస్డీ కోసం వెతుకుతున్న పోలీసులు..ఇవాళ ఉదయం తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అతని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని,చంపేందుకు ప్రయత్నించాడని ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు సుమంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.తాజాగా సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు నిందితుడి కోసం విచారించనున్నట్టు సమాచారం.